Ravi Teja | ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేరళలో వందకోట్ల వసూళ్లను రాబట్టిందా సినిమా. ఆ సినిమాను తెలుగులో పునర్నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో బాలకృష్ణ ఈ సినిమా చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని హీరో రవితేజ సొంతం చేసుకున్నారట.
మరి ఆయనే చేయడానికి తీసుకున్నారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది తెలియాల్సివుంది. నిజానికి ‘ఆవేశం’ కథ రవితేజ శారీరకభాషకు సరిగ్గా సరిపోతుంది. ఆయన చేస్తేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.