సైరా నరసింహా రెడ్డి చిత్రం తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆచార్య షూటింగ్ పూర్తి కావడంతో చిరంజీవి తాను కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. గాడ్ ఫాదర్ షూటింగ్ ఇప్పటికే మొదలు పెట్టిన చిరంజీవి త్వరలో భోళా శంకర్, బాబీ మూవీల షూటింగ్ ప్రారంభించనున్నాడు. అయితే చిరు సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మెగాస్టార్ 154వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా వస్తుండగా,ఇందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఓ బలమైన పాత్రకు రవితేజ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి బాబీ.. మాస్‌రాజాని అప్రోచ్ కాగా,ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
రవితేజ నటించిన ఖిలాడి చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుండగా, ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్‌డ్యూటీ’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు చిరు చిత్రంలో కూడా నటిస్తే ఇక అభిమానులకి పూనకాలు రావల్సిందే.