Eagle | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి (RT 73). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను లాంఛ్ చేశారు. రవితేజ తాజా చిత్రానికి ఈగల్ (Eagle) టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఒక్క పెయింటర్‌ను పట్టుకోవడానికి ఇంత మంది టీమా..? అనే సంభాషణలతో షురూ అయిన వీడియోలో ఇంతకీ పెయింటర్ ఎవరు..? ఏం నేరం చేశాడనేది సస్పెన్స్ లో పెట్టేశాడు డైరెక్టర్. ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి.. ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి.. అని అడుగుతోంది అనుపమ. మొత్తానికి ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నట్టు వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్.. ఇంతకీ స్టోరీ ఏంటనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టేశాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్లో కొత్త దర్శకులను అవకాశం ఇచ్చే హీరోల్లో ముందు వరుసల ఉంటాడు రవితేజ. ఇప్పటికే డెబ్యూ డైరెక్టర్ వంశీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్ రావు కూడా చేస్తున్నాడు రవితేజ. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
ఈ సంక్రాంతికి వేసేది చలి మంట కాదు దావాగ్ని! 🦅🔥@RaviTeja_offl‘s #Eagle MASSive ERUPTION – Title Announcement Video 💥https://t.co/o5BsISua8J
Sankranthi Release, 2024 🥁
@anupamahere @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @davzandrockz @manibkaranam— Karthik Gattamneni (@Karthik_gatta) June 12, 2023