EAGLE Teaser | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఈగల్ (Eagle). సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ చిత్రంలో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈగల్ టీజర్‌ను రేపు ఉదయం 10:44 గంటలకు లాంఛ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. ఈగల్ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్ పట్టుకున్న రవితేజ స్టిల్‌ను రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించాడు డైరెక్టర్. మాస్ మహారాజా విధ్వంసం అంటే ఎలా ఉంటుందో మరోసారి అందరికీ రుచి చూపించాలని గట్టిగానే ఫిక్సయినట్టు అర్థమవుతోంది. మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు.. అంటూ మేకర్స్ లాంఛ్ చేసిన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈగల్లో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. Davzand సంగీతం అందిస్తున్నారు.
రవితేజ రీసెంట్గా పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఈగల్ టీజర్ లాంఛ్ అప్డేట్ ..
సిద్ధం కండి!🔥🦅
The much-awaited #EAGLETeaser will be out TOMORROW at 10:44 AM! 🌋@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809@davzandrockz @manibkaranam@Sri_Avasarala@sujithkolli @Srinagendra_Art… pic.twitter.com/5Qb5mfrwYo
— People Media Factory (@peoplemediafcy) November 5, 2023
ఈగల్ విడుదల తేదీ ఫిక్స్..
మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు 🤩
The Man, The Myth, The Massacre 💥#EAGLE 🦅 is arriving on 𝐉𝐀𝐍 𝟏𝟑, 𝟐𝟎𝟐𝟒.🤘🏻#EAGLEonJan13th @RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@pnavdeep26 @VinayRai1809@davzandrockz… pic.twitter.com/8k0Vgq95Na
— People Media Factory (@peoplemediafcy) September 27, 2023
అతనొస్తున్నాడు !! 🔥#EAGLE 🦅 has locked it’s course of destruction 🤘🏻
Massive upDATE LOADing Today at 4:05 PM 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@davzandrockz @manibkaranam @sujithkolli @srinu10477@UrsVamsiShekar pic.twitter.com/kC9lDPROPL
— People Media Factory (@peoplemediafcy) September 27, 2023
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
#Eagle movie songs are going to be Feast 🤩 🦅
It’s Definitely Special 🕺@RaviTeja_offl@Karthik_gatta @manibkaranam @sujithkolli https://t.co/dc33g3DDZF— People Media Factory (@peoplemediafcy) August 27, 2023