కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకులకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ఆ కాంబినేషన్స్‌లో సినిమాలు వస్తే ప్రేక్షకులలో ఆనందం అంతా ఇంతా కాదు. టాలీవుడ్లో రవితేజ- ఇలియానా కాంబినేషన్‌పై కూడా అభిమానులలో చాలా ఆస్తి నెలకొని ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో కిక్,దేవుడు చేసిన మనుషులు, ఇలియానా రీఎంట్రీ చిత్రం అమర్ అక్భర్ ఆంటోని రూపొందాయి. ఇందులో కిక్ చిత్రం ఒక్కటే మంచి విజయం సాధించింది. అయినప్పటికీ ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉంటాయి.
రవితేజ- ఇలియానా ముచ్చటగా నాలుగో సారి జత కట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి హీరోయిన్గా కాకుండా రవితేజ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందట. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంతో బిజీగా ఉండగా,ఇందులో ఇలియానాతో స్పెషల్ సాంగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్టు కూడా ప్రచారం జరుగుతుంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా ఇటీవలే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేసారు. అందులో ఒకరు తమిళం మరియు మలయాళం చిత్ర సీమలో టెలివిజన్ యాంకర్ గా, పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించిన రజిషా విజయన్ కాగా, మరో భామ “మజిలీ” సినిమాలో కీలక పాత్రలో కనిపించిన దివ్యన్షా కౌశిక్ . ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ తో పాటు రవితేజ టీం వర్క్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ఒక పవర్ ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు.