ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో రవితేజ. ఆయన నటిస్తున్న ‘ఈగిల్’ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు షూటింగ్స్‌ను జరుపుకుంటున్నాయి. ఇదిలావుండగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ‘షాక్’ ‘మిరపకాయ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రమిది కావడం విశేషం.
తాజా సమాచారం ప్రకారం 1980 నేపథ్యంలో జరిగే పీరియాడిక్ కథాంశమిదని, రవితేజ శైలి వినోదం, యాక్షన్ అంశాల కలబోతగా సాగుతుందని అంటున్నారు. ప్రస్తుతం హరీష్‌శంకర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని అనంతరం రవితేజ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలిసింది. అయితే ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.