Raveena Tandon | స్విమ్సూట్ వేసుకోవడం ఇష్టం లేక అగ్ర నటుడు షారుఖ్ సినిమాను రిజెక్ట్ చేశానని తెలిపింది బాలీవుడ్ కథానాయిక రవీనా టాండన్ (Raveena Tandon). ఈ సినిమా విడుదలైన దాదాపు 32 ఏండ్ల తర్వాత తాజాగా ఈ ఘటనను పంచుకుంది ఈ భామ.
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) విలన్గా నటించిన ‘డర్’ సినిమాలో హీరోయిన్గా చేయమని చిత్రబృందం మొదట నన్నే సంప్రదించింది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నన్ను అసౌకర్యానికి గురిచేశాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేశాను. చివరకు ఆ పాత్ర జూహీచావ్లాను వరించింది. నేను ఈ సినిమాను వదులుకోవడానికి కాస్ట్యూమ్స్ కూడా ఒక కారణం. అందులో కొన్ని సన్నివేశాలలో స్విమ్సూట్ ధరించాలని చెప్పారు. దానికి నేను అంగీకరించలేదు. అలా డర్ సినిమా అవకాశాన్ని నేను కొల్పోయాను అంటూ రవీనా చెప్పుకోచ్చింది.
దిగ్గజ దర్శకుడు యష్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన చిత్రం డర్. 1993లో వచ్చిన ఈ సినిమాలో సన్ని డియోల్ కథానాయకుడిగా నటించగా.. షారుఖ్ ఖాన్ విలన్గా నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా షారుఖ్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ విలన్గా షారుఖ్ అవార్డును కూడా అందుకున్నాడు.