రవితేజ నటిస్తున్న సినిమాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్షన్లో తెరకెక్కుతుంది. అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఇవాళ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ కొత్త అప్డేట్ అందించారు.
రావణాసుర కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ 2023 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో సుశాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహ్తా ఇతర సహాయ కార్యక్రమాల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
రవితేజ మరోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా కూడా చేస్తున్నాడు. అదేవిధంగా పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు, మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న వాల్తేరు వీరయ్యలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
The date is locked🔒to enter the world where HEROES DON’T EXIST👺
Mass Maharaja @RaviTeja_offl ‘s #𝗥𝗔𝗩𝗔𝗡𝗔𝗦𝗨𝗥𝗔 WW Grand Release on April 7th 2023 ❤️🔥#HappyDiwali @iamSushanthA @sudheerkvarma@AbhishekPicture @SrikanthVissa @rameemusic @Bheems1 pic.twitter.com/O6CKoj6Q6N
— RT Team Works (@RTTeamWorks) October 24, 2022
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Sir | ధనుష్ టీం దీపావళి శుభాకాంక్షలు.. సార్ కొత్త పోస్టర్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే