Khairatabad Ganapathi | ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని
Khairatabad Ganapathi | మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ లోని పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ : మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) ఖైరతాబాద్ లోని పంచముఖ సంకటహర మహాగణపతి ( Khairatabad Ganapathi ) ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆధ్వర్యంలో తలసానిని సన్మానించి గణపతి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలో నే అతిపెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ గణపతి కి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 69 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. 11 రోజుల పాటు పూజలు అందుకునే అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పారు.
ప్రజలందరిపై ఆ గణనాధుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలి ఆకాంక్షించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భారీకెడ్లు , సీసీ కెమెరాలు, నిమజ్జనం క్రేన్ తదితర ఏర్పాట్లను గతంలో ఉత్సవ కమిటీ వారు చేసుకునే వారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మంత్రిగా తాను చొరవ తీసుకుని అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయడం జరిగిందని వివరించారు. ఆయన వెంట ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నాయకులు బాక్సర్ అశోక్, గజ్జెల నగేష్, మహేష్ యాదవ్, రాంరెడ్డి, ఆనంద్, మహేందర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

