Ravanasura Movie | రావణాసుర ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Ravanasura Movie Trailer | మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది చివర్లో 'ధమాకా' అంటూ బాక్సాఫీస్ దగ్గర పటాసులు పేల్చిన రవన్న.. ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
Ravanasura Movie Trailer | మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది చివర్లో ‘ధమాకా’ అంటూ బాక్సాఫీస్ దగ్గర పటాసులు పేల్చిన రవన్న.. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెయిన్ హీరో చిరునే అయినా.. సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ రవితేజకే దక్కింది. ప్రస్తుతం రవితేజ హ్యాట్రిక్‌పై కన్నేశాడు. ఆయన హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక సినిమాలోని పాటలైతే ఇన్‌స్టాంట్‌గా ఎక్కేశాయి. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను ప్రకటించారు.
రావణాసుర ట్రైలర్‌ను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీను ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
The fireworks will begin in advance for you all 🤗#RavanasuraTrailer on 28th March at 4:05 PM 😎#Ravanasura#RavanasuraOnApril7 pic.twitter.com/lE0DFISvUD
— Ravi Teja (@RaviTeja_offl) March 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

