Sai Durga Tej | నటి పావల శ్యామలకు మెగా హీరో ఆర్థిక సాయం
Sai Durga Tej | పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. ఇటీవల తండ్రీకూతుళ్ల ఓ వీడియోను కించపరిచే విధంగా వీడియోను చేసిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్‌పై చర్య తీసుకునే విధంగా తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సాయి దుర్గ తేజ్ అందరిలోనూ చైతన్యం నింపారు.
Sai Durga Tej | పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. ఇటీవల తండ్రీకూతుళ్ల ఓ వీడియోను కించపరిచే విధంగా వీడియోను చేసిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్‌పై చర్య తీసుకునే విధంగా తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సాయి దుర్గ తేజ్ అందరిలోనూ చైతన్యం నింపారు. అలాంటి వాళ్లపై జాగ్రత్తగా వుండాలని అవగాహన కల్పించారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా తెలంగాణ ప్రభుత్వం హనుమంతుపై చర్యలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు రోడ్డు భద్రత వారోత్సవాలు, క్యాన్సర్ అవగాహన ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే సాయి దుర్గ తేజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సీనియర్ నటి పావలా శ్యామలా ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆయన తన వంతుగా లక్ష రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో పావల శ్యామలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఈ సహాయాన్ని అందజేశారు.
సాయి దుర్గ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని తనకు కష్టకాలంలో ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల పావల శ్యామల ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయి దుర్గ తేజ్ ఆమెతో వీడియో కాల్లో మాట్లాడుతూ భవిష్యత్‌లో కూడా అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు. సాయి దుర్గ తేజ్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఆయన బాగుండాలని, ఏమీ కాకుండా వెంటనే కోలుకోవాలని తను దేవుడ్ని వేడుకున్నట్లుగా పావలా శ్యామలా తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు అందించిన ఆర్థిక సహాయం గురించి కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. పావలా శ్యామల మాటల విన్న సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ అయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

