అందం, మానసిక పరిపూర్ణత అలంకారాలుగా చేసుకున్న నటి రష్మిక మందన్నా. బాలీవుడ్లో ఆమె నటించిన, యానిమల్, చావా చిత్రాలు భారీ విజయాలను నమోదు చేయగా, సల్మాన్‌ఖాన్‌తో ఆమె నటించిన ‘సికిందర్’ సినిమా మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. అదే జీవితం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తున్నదీ అంటే.. ఇక మనకు మించిన అదృష్టవంతులు వేరొకరు లేరని అర్థం.
నేను చేసే ఏ సినిమా విషయంలోనూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. అది బాగా ఆడితే వెరీగుడ్. ఆడపోతే బ్యాడ్‌లక్..అంతే.’ అని చెప్పుకొచ్చింది రష్మిక. ఇంకా చెబుతూ ‘జీవితంలో కఠినమైన పాఠాలుండవ్. అన్నీ విలువైన పాఠాలే ఉంటాయి. మనం వాటిని తీసుకునే విధానంలోనే తేడా ఉంటుంది. ఈ సందర్భంగా అందరికీ నేనిచ్చే సలహా ఒక్కటే. ఇతరులను సంతోషపెట్టాలనే భారాన్ని మాత్రం మోయకండి. మీ ఆనందంపై దృష్టి పెట్టండి. అప్పుడు మీ కుటుంబాలు కూడా బావుంటాయి.’ అని పేర్కొన్నది రష్మిక మందన్నా.