విజయ్‌దేవరకొండ-రష్మిక మందన్న జోడీని హిట్‌పెయిర్‌గా అభివర్ణిస్తారు. వెండితెరపై ఈ జంట చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు మురిసిపోతుంటారు. వ్యక్తిగత జీవితంలో కూడా వీరిద్దరి మధ్య చక్కటి స్నేహసంబంధాలున్నాయి. అయితే ఈ జోడీ మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉందనే వార్తలు వినిపిస్తుంటాయి. ఈ రూమర్స్‌పై అనేక సందర్భాల్లో వారు స్పష్టతనిచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకుమించిన బంధమేదీ లేదని తేల్చిచెప్పారు. తాజా ఇంటర్వ్యూలో కూడా రష్మిక మందన్న అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇద్దరం కెరీర్‌ను ఒకేసారి ఆరంభించాం కాబట్టి ఈ ప్రయాణంలో విజయ్ దేవరకొండ గొప్ప స్నేహితుడుగా మారాడని చెప్పింది. తామిద్దరం ఎలాంటి భేషజాలు లేకుండా అభిప్రాయాల్ని వ్యక్తం చేసుకుంటామని, కెరీర్ విషయంలో విజయ్ సలహాలు కూడా తీసుకుంటానని రష్మిక మందన్న పేర్కొంది. ప్రస్తుతం ఈ కన్నడ వయ్యారి తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది. ‘మిషన్ మజ్ను’ చిత్రం ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేసింది.