కరోనా వలన మనతో నిత్యం ఉండే వస్తువులలో మాస్క్ అనేది కూడా కామన్‌గా మారింది. ఏది మరచిపోయిన పర్లేదు కాని మాస్క్ మాత్రం మరిచిపోవద్దు. మాస్క్ లేకుండా బయటకు వస్తే పోలీసులు భారీ ఫైన్ వేస్తున్నారు. తన ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త వహించే రష్మిక హడావిడిలో మాస్క్ మరచిపోయింది. ఇటీవల రష్మిక ఒక చోటుకు వెళ్లగా, అక్కడ కారు దిగి అలా నడుచుకుంటూ వచ్చింది.
కొన్ని సెకన్ల తర్వాత ఆమె తాను మాస్క్ పెట్టుకోలేదు అని గుర్తించింది. వెంటనే ఆమె వెనక్కు వెళ్లి మాస్క్ పెట్టుకుంది. మాస్క్ పెట్టుకోలేదు అనే విషయం గుర్తించిన సమయంలో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఎంతో క్యూట్ గా ఉంది. మాస్క్ లేకుండా కొద్ది నిమిషాలు ఉన్న రష్మిక ముక్కు మరియు మూతికి చేతిని అడ్డు పెట్టుకుని ఉంది. ఆమె సోషల్ రెస్పాన్సిబులిటీ చూసి అంతా కూడా ముచ్చట పడుతున్నారు.
ఇక రష్మిక సినిమా ల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా వరుస సినిమా లతో దూసుకు పోతుంది. కన్నడ, హిందీ భాషలలోను సినిమాలు చేస్తుంది. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతుంది.