Rashmika Mandanna | మరో జన్మలో అబ్బాయిగా పుట్టాలనుంది: రష్మిక
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). మార్చి 4న (రేపు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాయి.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మార్చి 4న (రేపు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాయి. ఇంతకీ అంతగా మాట్లాడుకునేలా కామెంట్ ఏం చేసిందా..? అనే కదా మీ డౌటు. రష్మిక మరో జన్మ గురించి మాట్లాడింది.
ఇంతకీ మరో లైఫ్ అంటూ ఉంటే తానెలా ఉండాలనుకుంటుందో రష్మిక చెప్పడమే ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘సినిమా విడుదల నేపథ్యంలో కొంత నర్వస్‌గా, హ్యాపీగా, ఎక్జయిటింగ్‌గా ఉందంది. నా నెక్ట్స్ లైఫ్‌లో అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నా. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేసిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నా. ఈ సినిమాల కోసం డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని చాలా విసిగిపోయాను’ అని చెప్పుకొచ్చింది.
ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు. యూత్ కంటెంట్ కూడా ఉంటుంది. రష్మిక-ఖుష్బూ బంధం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. ఇంటర్వెల్లో వచ్చే సన్నివేశాలకు మహిళలు విజిల్స్ వేయడం పక్కా అన్నారు. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు అందమైన అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ కిశోర్ తిరుమల అన్నాడు. ఈ సినిమాలో ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు దేవీ శ్రీప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ డైరెక్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

