Rashmika | అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. దీక్షిత్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ‘వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది.
రష్మిక మందన్న పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. రష్మిక కెరీర్లో ఓ విభిన్నమైన సినిమాగా మిగిలిపోతుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, ప్రొడక్షన్ డిజైన్: ఎస్.రామకృష్ణ, మౌనిక నిగోత్రి, సమర్పణ: అల్లు అరవింద్, రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.