రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఏం జరుగుతోంది..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
దీనికి హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరాల్ని అందించగా, రాకేందుమౌళి రచించారు. చిన్మయి శ్రీపాద ఆలపించారు. ‘కలకలమను కలగలిపిన కథ మొదలా, కలవరమున తెగనలిగిన నిజము కలా, ఏం చేయను తడబడిన తప్పటడుగా, మనసా తెలుసా, ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది..’ అంటూ హార్ట్‌టచింగ్ ఫీల్‌తో మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది.
ఓ ప్రేమ జంట అందమైన ప్రయాణానికి దృశ్యరూపంలా ఈ సినిమా ఆకట్టుకుంటుందని, కథలోని మలుపులు ఉత్కంఠకు గురిచేస్తాయని, రోటీన్ ప్రేమకథలకు భిన్నంగా కొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.