The Girlfriend | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ (Netflix)లో ఈరోజు నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భూమా (రష్మిక మందన్న) పీజీ చేయడానికి హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్ లో పీజీ చేయడానికి వచ్చిన విక్రమ్ (దీక్షిత్ శెట్టి) భుమాని ఇష్టపడతాడు. ఒక బలహీనమైన క్షణంలో భూమా కూడా విక్రమ్ ని ఇష్టపడుతుంది. విక్రమ్ కి జెలసీ, పోసిస్సివెన్స్ ఎక్కువ. తనది పాత కాలం మనస్తత్వం. విక్రమ్ తో రోజులు గడుపుతున్నకొద్ది భూమాకి కొన్ని విషయాలు అర్ధమౌతూవస్తుంటాయి. రిలేషన్షిప్ లో ఓ చిన్న బ్రేక్ కావాలని ఆడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విక్రమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు ? ఈ కథలో దుర్గా (అను ఇమ్మానుయేల్) పాత్ర ఏమిటి? చివరికి భూమా ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మిగతా కథ.
From innocent smiles to silent screams, witness the journey of Bhooma ❤️ pic.twitter.com/aFV4zpvTiZ
— Netflix India South (@Netflix_INSouth) December 5, 2025