నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు దేశవ్యాప్తంగా అభిమాగణం ఉంది. ‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు.. తాజా చిత్రం ‘యానిమల్’తో యువతరానికి మరింతగా చేరువైంది. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన వీరాభిమాని ప్రమోద్ భాస్కర్‌తో వీడియో కాల్ ద్వారా ముచ్చటించింది. అందుకు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ రియాల్టీ షో వేదికైంది. రష్మిక మందన్నను సోషల్‌మీడియాలో ఫాలో అవుతున్నాడు ప్రమోద్. ఆమె సినిమాలపై విశ్లేషణలు కూడా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నతో మాట్లాడాలనుందనే తన కోరికను అమితాబ్ ముందుంచాడు ప్రమోద్. దీంతో అమితాబ్.. రష్మికకు ఫోన్ చేసి ప్రమోద్‌తో మాట్లాడించాడు. తన అభిమాన నాయిక వీడియో కాల్లో మాట్లాడటంతో ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు ప్రమోద్. ‘మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నా. ఓసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలనుంది’ అని ప్రమోద్ అడగ్గా.. అందుకు సరేనని బదులిచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘యానిమల్’ సినిమాలో రష్మిక అభినయం చాలా బాగుందని అమితాబ్ బచ్చన్ సైతం
ప్రశంసలు కురిపించారు.