కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నెట్టింట చురుకుగా ఉంటుందని తెలిసిందే. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్ల ముందుకొస్తుంటుంది. ఈ భామ ప్రస్తుతం ప్రపంచప్రఖ్యాత టూరిజం స్పాట్ మాల్దీవులు వెకేషన్టూర్లో బిజీగా ఉన్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా షూటింగ్స్ నుంచి విరామం తీసుకున్న రష్మిక మాల్దీవుల్లో క్వాలిటీ టైంను సరదాగా గడిపేస్తుంది.
బిజీ షెడ్యూల్ నుంచి దూరంగా అన్నీ మరిచిపోయి హాయిగా సాగరతీరంలో షికారు చేస్తూ..ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. ఈ భామ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో అందరికీ ముఖ్యమైన సలహా ఒకటి ఇచ్చింది. బీచ్ లొకేషన్ ఫొటోను షేర్ చేస్తూ..ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉన్నా..వ్యాయామం చేయడం మర్చిపోవద్దు..అని స్టిల్ మీద రాసుకొచ్చింది. ఫిజికల్ హెల్త్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ పెట్టిన ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రష్మిక మందన్నా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన గుడ్‌బై ఇటీవలే విడుదలైంది. దీంతోపాటు మిషన్ మజ్ను, విజయ్‌తో కలిసి వారసుడు, పుష్ప..ది రూల్ సినిమాలు రష్మిక చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక. రష్మిక ఇటీవలే వైట్ మోనోక్రోమ్ కాస్ట్యూమ్స్‌లో దిగిన ఫొటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?