టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) సోషల్ మీడియాలో సినిమాల అప్డేట్స్ ఇవ్వడమే కాదు..అప్పుడపుడు వెకేషన్స్ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, కొత్త లుక్స్‌ను షేర్ చేసుకుంటాడని తెలిసిందే. తాజాగా కొత్త లుక్ ఒకటి నెట్టింట షేర్ చేసుకున్నాడు. పెట్ డాగ్ రైమ్‌ను ఎత్తుకున్న స్టిల్‌ను షేర్ చేశాడు. లేటెస్ట్ స్టిల్‌లో గడ్డం లేకుండా సాఫ్ట్ లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. రాంచరణ్ తాజా ఫొటో ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ (Shankar) దర్శకత్వంలో ఆర్సీ 15 (RC15) సినిమాతో బిజీగా ఉన్నాడు రాంచరణ్ . భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, అంజలి, కన్నడ యాక్టర్ జయరామ్, నవీన్ చంద్ర ఇతర కీ రోల్స్ చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్సీ 15 ప్రాజెక్టుకు కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Fahadh Faasil | పుష్ప యాక్టర్ పాన్ ఇండియా సినిమా లాంఛ్..వివరాలివే..!
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?