కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉందని, ఈ విషయంలో చాలా కష్టపడుతున్నానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామకు చేతినిండా సినిమాలున్నాయి. అవన్నీ భారీ చిత్రాలే కావడంతో కుటుంబ జీవితానికి ఏమాత్రం సమయం చిక్కడం లేదట. ముఖ్యంగా తన చెల్లితో కాలక్షేపం చేయడానికి వీలులేకుండా పోయిందని బాధపడిపోతున్నదీ భామ. సెలవు రోజుల్ని మీరు ఎలా గడుపుతారు? అనే ప్రశ్నకు రష్మిక మందన్న బదులిచ్చింది. ‘చెల్లి నాకంటే 16 ఏళ్లు చిన్నది. గత ఎనిమిదేళ్లుగా కెరీర్లో బిజీగా ఉండటం వల్ల తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా.
గత సంవత్సరకాలంగా మా ఇంటికే వెళ్లలేదు. స్నేహితులను కూడా కలవలేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఏదైనా టూర్‌కి ప్లాన్ చేస్తే తప్పకుండా నన్ను తీసుకెళ్లేవారు. ఇప్పుడు నేను బిజీగా ఉండటం వల్ల టూర్ల గురించి సమాచారం కూడా ఇవ్వట్లేదు. వీకెండ్స్‌లో కూడా పనిచేయడం బాధగా అనిపిస్తుంది. సెలవు తీసుకొని ఫ్యామిలీతో గడిపే సమయం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను’ అని చెప్పింది రష్మిక మందన్న. ఈ ఏడాది ఇప్పటికే ‘ఛావా’ ‘కుబేర’ చిత్రాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం ‘థామ’ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ‘మైసా’ అనే చిత్రాల్లో నటిస్తున్నది.