పాత్ర గొప్పదైతే కొంతవరకు పరిధులు దాటడానికి కూడా వెనుకాడనంటున్నది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రణ్‌బీర్‌కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కథానుగుణంగా కొన్ని లిప్‌లాక్‌లు కంపల్సరీ అట. ఆ విషయం తెలిసీ, పాత్ర నచ్చడంతో కాదనలేక ఓకే చెప్పేసిందట రష్మిక. అయితే, మామూలుగా సినిమాకు రెండుకోట్ల్ల వరకూ పారితోషికాన్ని అందుకునే ఈ అందాలభామ.. ఈ సినిమాకు మత్రం ఇంకాస్త ఎక్కువే డిమాండ్ చేసినట్లు తెలిసింది. కథ డిమాండ్ మేరకు లిప్‌లాక్‌లు ఉన్నా.. అవన్నీ అర్థవంతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్నీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ, మరో వైపు వ్యాపారప్రకటనల్లో నటిస్తూ బిజీబిజీగా కెరీర్ సాగిస్తున్నది రష్మిక.