‘పుష్ప-3’ చిత్రంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించే అవకాశం ఉందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కొన్నేళ్ల క్రితం విజయ్ దేవరకొండ చేసిన ఓ పోస్ట్‌ను ఉటంకిస్తూ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ‘పుష్ప-2’ ైక్లెమాక్స్‌లో పుష్పరాజ్‌పై ఓ అపరిచిత వ్యక్తి బాంబు దాడికి పాల్పడినట్లుగా చూపించారు. అతను విజయ్ దేవరకొండ అని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న స్పందించింది.
ఆమె మాట్లాడుతూ ‘దర్శకుడు సుకుమార్ ప్రతీ విషయంలో చివరి వరకూ సస్పెన్స్‌ను కొనసాగిస్తారు. ‘పుష్ప-2’ ైక్లెమాక్స్‌లో ఆ సీన్‌ను చూసి నేను కూడా ఆశ్చర్యపోయా. ఆ బాంబు విసిరిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది. నేను కూడా మీలాగే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలనుకుంటున్నా’ అని చెప్పింది. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పుష్ప-2’ చిత్రం ఇప్పటికే 1000కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి దూసుకుపోతున్నది. ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక మందన్న పాత్ర అందరిని ఆకట్టుకుంటున్నది.