Allu Arjun | పుష్పరాజ్‌కు శ్రీవల్లి స్పెషల్ బర్త్‌డే విషెస్.. రేర్ పిక్ షేర్ చేసిన నేషనల్ క్రష్
Allu Arjun | ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా బన్నీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
Allu Arjun | ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్తోపాలు పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా బన్నీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా బన్నీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
రష్మిక.. బన్నీతో కలిసి పుష్ప-2లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ రేర్ ఫొటోను షేర్ చేస్తూ పుష్పరాజ్‌కు శ్రీవల్లి స్పెషల్ విషెస్ తెలియజేసింది. పుష్ప సినిమా సెట్లో సింహం బొమ్మ పక్కన ఎంతో ఠీవిగా కూర్చున్న అల్లు అర్జున్ ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే పుష్పరాజ్’ అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
కాగా, అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న సీక్వెల్ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ రోల్లో కనిపించనుంది. పార్టు 2లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఫస్ట్ పార్టును మించిపోయేలా అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

Rashmika Allu Arjun1
Also Read..
Allu Arjun | అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ సందడి.. వీడియోలు
Aishwarya Rajinikanth | విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐశ్వర్య-ధనుష్ దంపతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

