Rashmika Mandanna – Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో ఈ హిట్ జోడి మళ్లీ తెరపై రోమాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టాక్సీవాలా తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో మంచి అంచనాలు ఉన్నాయి. వీడీ 14గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో కథానాయికకు సంబంధించి ఒక వార్త వైరల్గా మారింది. ఈ మూవీలో కథానాయికగా మేకర్స్ రష్మిక మందన్నాని అనుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్కి పండగనే చెప్పుకోవాలి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమాల విషయానికి వస్తే.. కింగ్డమ్ సినిమాతో విజయ్ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక విషయానికి వస్తే.. ప్రస్తుతం మైసా అనే చిత్రంలో నటిస్తుంది.