Rashmika Mandanna | ప్రస్తుతం రష్మిక క్రేజ్ మామూలుగా లేదు. కేవలం ఆమె కోసమే టిక్కెట్స్ తెగే స్థాయికి ఎదిగింది నేషనల్ క్రష్ రష్మిక. అలాంటి స్టార్ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొంటే ఏమన్నా ఉందా!? అభిమానుల్ని కంట్రోల్ చేయడం చిన్న విషయం కాదు కదా.. రీసెంట్గా కేరళలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రష్మిక కేరళలోని కరునాగపల్లిలో ఓ పబ్లిక్ ఈవెంట్‌కి హాజరైంది. దాంతో వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. కంట్రోల్ చేయడం కేరళ పోలీసులకు పెద్ద టాస్క్‌గా మారింది. దీనిపై రష్మిక తన ఎక్స్(ట్విటర్) ద్వారా స్పందించింది.
‘జూలై 25 నా జీవితంలో మర్చిపోలేను. కేరళ కరునాగపల్లి ప్రజానీకం నాపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేకపోతున్నా. అంత ప్రేమను అస్సలు ఊహించలేదు. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇంత ఆరాధింపబడటానికీ.. ఇంత ప్రేమను పొందటానికీ నేనేం చేశాను? కేవలం ఒక నటిని ఇంతగా అభిమానిస్తారా? సంతోషంలో మాటలు రావడంలేదు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యింది రష్మిక.