ఇండియాలో టాప్ స్టార్ల జాబితాలో ఒకరిగా నిలిచింది కన్నడ సోయగం రష్మిక మందన్నా. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) పోషించిన శ్రీవల్లి పాత్ర ఆమె క్రేజ్‌ను మరింత పెంచేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ భామపై లింకప్ రూమర్లు రావడం కొత్తేమీ కాదు. గతంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రిలేషన్ షిప్ అంటూ వార్తలు వచ్చినా..వాటిపై ఇద్దరు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మికను ఇదే విషయంపై యాంకర్ అడిగితే…మీడియా తన గురించి చాలా రాసుకొచ్చిందని, అలాంటి పుకార్లపై తాను స్పందించనని చెప్పింది. యాక్టర్ల జీవితాల్లో రూమర్లు సర్వసాధారణమైనవని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు (Adavallu Meeku Joharlu)చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా ఉంది రష్మిక, శర్వానంద్ టీం. పుష్పతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టిన రష్మిక మరో సక్సెస్‌ను కూడా అందుకోవడం ఖాయమని ఫిక్సయిపోయారు సినీ జనాలు.