Rashmika | రష్మిక ఇమేజ్ దేశం దాటి ఇప్పుడు విదేశాలకు కూడా పాకినట్టుంది. ‘పుష్ప’, ‘యానిమల్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ ఫంక్షన్లో మన దేశం తరఫున పాల్గొనేందుకు జపాన్‌లోని టోక్యోకి వెళ్లింది. అంతే.. టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో రష్మికకు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
రష్మిక ఫొటోలతో డిజైన్ చేసిన ప్లకార్డులను చూపిస్తూ.. రష్మికకు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ పరిణామాన్ని చూసి రష్మిక ఆశ్చర్యానికి లోనైంది. ఇక్కడ కూడా ఇంతమంది అభిమానులున్నారంటే నమ్మలేకపోతున్నానంటూ ఆనందం వెలివెబుచ్చింది. గ్లోబల్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ అవార్డుల కార్యక్రమంలో మన దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం రష్మికను వరించింది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా రష్మిక నిలవడం నిజంగా గర్వకారణం.