Rashmika Mandanna | అగ్ర కథానాయిక రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమవుతున్నది. ఇటీవలకాలంలో ఈ కన్నడ కస్తూరి నటించిన సినిమాలన్నీ ఐదొందల కోట్ల వసూళ్ల మైలురాయిని దాటడం విశేషం. యానిమల్, పుష్ప-2, ఛావా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. దాంతో అభిమానులు మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ భామ ఆస్తుల గురించి ఫోర్బ్స్ సంస్థ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.
ఇప్పటికే రష్మిక మందన్న 70కోట్ల వరకు ఆస్తులను సంపాదించిందని, త్వరలో అది 100కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు ముంబయి, బెంగళూరు, గోవా, కూర్గ్‌లో రష్మిక మందన్నకు సొంత నివాస భవనాలున్నాయి. వీటి విలువ వందకోట్లకుపైనే ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదితో పాటు హిందీలో వరుస సక్సెస్‌లతో రష్మిక మందన్న రెమ్యునరేషన్‌ను భారీగా పెంచిందని, ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని చెబుతున్నారు. దక్షిణాది కథానాయికల్లో సంపాదనపరంగా ఆమె నెంబర్‌వన్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.