Rashmika Mandanna | పేరుకు కన్నడ కుట్టి అయితన తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది రష్మిక మందన్న. ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. రష్మిక తన డెబ్యూ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంది. నాగ శౌర్య సరసన ‘ఛలో’ సినిమాతో తొలి అడుగు వేసిన రష్మిక, ఆ సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ వెంటనే ‘గీతా గోవిందం’ తో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. తర్వాత వరుసగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’, ‘సీతారామం’ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తన దూకుడు కొనసాగించింది.
రష్మిక ఏ సినిమా ఒప్పుకున్నా అది హిట్ అవుతుందన్న నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది. గత రెండేళ్లలో ఆమె కెరీర్ గ్రాఫ్ అమాంతం ఎగబాకింది. ఆమె చేసిన సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ, అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి భారీ ప్రాజెక్టులతో ప్యాన్ ఇండియా రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా రష్మిక మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుంది. ‘మైసాస అనే సినిమాని ఓకే చేయగా, ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రష్మిక ఓ యోధురాలు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతోందన్న టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
రవీంద్ర పూలే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ఆదివారం (జులై 27) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించిన ఈ వేడుకలో రష్మిక గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఇప్పటికే రష్మిక తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, హిందీలో ‘థామా’ వంటి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మైసా’ కూడా లైన్లోకి రావడంతో, ఆమె కెరీర్లో మరో కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.