మంచితనానికి పరిమళమెక్కువంటారు. మనసు మంచిదైతే ఆ ప్రభావం మనిషిలో కూడా కనిపిస్తుంది. అందుకే అనుకుంట కథానాయిక రష్మిక మందన్న నేషనల్ క్రష్ అయ్యారు. సోమవారం తన అసిస్టెంట్ పెళ్లికి హాజరై అక్కడున్నవారందరిని ఆశ్చర్యపరిచారు రష్మిక. ఆమె రాకతో పెళ్లికి విచ్చేసిన వారందరూ ఆనందంతో పొంగిపోయారు.వివరాల్లోకెళ్తే.. రష్మిక మందన్న అసిస్టెంట్ సాయి వివా హం ఆదివారం హైదరాబాద్లోని బహదూర్పల్లిలో జరిగింది. ఈ పెళ్లికి రష్మిక మందన్న హాజరై వధూవరులకు శుభాకాంక్షలందించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ ‘రెయిన్బో’ చిత్రాలతో పాటు శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది.