మెదక్ రూరల్ జనవరి13: . క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలుపు కోసం నిరంతర శ్రమించాలని మాజీ ఎంపీటిసి బెండ రమేష్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో యువతకు క్రికెట్ మ్యాచ్లకు ఆర్థిక సాయం అందజేస్తూ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం మెదక్ మండల పరిధిలోని బాలనగర్లో ప్రీమియర్ లీగ్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను బెండ రమేష్ తన చేతుల మీదగా ప్రారంభించారు.
పండుగ వేళ యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన బెండ రమేష్… వారితో కాసేపు క్రికెట్ ఆడి ఉల్లాసంగా గడిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ‘సంక్రాంతి పండగను పురస్కరించుకొని టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని, ఆరోగ్యంగా ఉంటార’ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలనగర్ సర్పంచ్ వీణ సంతోష్, తిమ్మక్కపల్లి సర్పంచ్ గణేష్ మాజీ సర్పంచ్ వికాస్, మాజీ ఉపసర్పంచ్ శివరాథోడ్, నాయకులు పాల్గొన్నారు.