Heroine| ఇప్పుడు ఇండస్ట్రీలో కొంత మంది భామలు దర్శక నిర్మాతలకి లక్కీగా మారారు. వాళ్లతో సినిమా చేస్తే హిట్ పక్కా అనే భావనలో ఉన్నారు. అలాంటి వారిలో రష్మిక మంధాన ఒకరు. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఈమె సెట్లో అడుగుపెడితే ఆ మూవీకి రూ.500 కోట్ల కలెక్షన్స్, చిందులేస్తే వెయ్యి కోట్లు అన్నట్టుగా ఉంది. సక్సెస్‌కి చిరునామాగా మారిన ఈ భామ కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫుల్ హ్యపీగా ఉన్న రష్మికా ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ మూవీలో బిజీగా ఉంది. ఈ చిత్రంతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఈమె ఖాతాలో ఉన్నాయి.
రష్మిక ఇటీవల ఛావా అనే సినిమాతో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రూ.500 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ మూవీ విడుదల అవుతుండడంతో చిత్రానికి మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం రష్మిక నటించిన పుష్ప కలెక్షన్స్ విషయంలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే పుష్పలో రష్మిక రోల్ పెద్దగా లేకపోయిన కూడా పుష్ప2లో మాత్రం చిత్ర కథ అంతా ఈ అమ్మడి చుట్టూనే తిరుగుతూ ఉండడంతో ఆమెకి మంచి పేరు వచ్చింది. పుష్ప 2 సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అయ్యారు.
బాలీవుడ్ లో రష్మిక నటించిన యానిమల్ సినిమా 900 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఇక పుష్ప 2 సినిమా దాదాపు 1900 కోట్ల కొల్లగొట్టింది. ఇక తాజాగా ఛావా చిత్రం 500 కోట్లు రాబట్టగా, ఈ మూవీ ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. మొత్తానికి మూడు సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేశాయి. వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న రష్మిక మందన్నా మధ్య మధ్యలో టూర్స్ కూడా వేస్తూ ఉంటుంది. ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటుంది. అలానే అప్పుడప్పుడు విజయ్ దేవరకొండతో తళుక్కున మెరుస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే ప్రచారం ఉంది. దీనిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కాగా, రష్మిక ఇప్పటి వరకు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా, ఆమె తన రెమ్యునరేషన్‌ని రూ.20 కోట్లకి కూడా పెంచే అవకాశం ఉంది.