ఏడురంగుల ప్రేమకథ
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రెయిన్బో’. దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు శాంతరూపన్ రూపొందిస్తున్నారు.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రెయిన్బో’. దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు శాంతరూపన్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని అమల క్లాప్‌నిచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ…“ఒకే ఒక జీవితం’ సినిమా తర్వాత మేము తెలుగులో నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నారు.
ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఆకట్టుకునేలా సినిమాను నిర్మిస్తాం. ఈ నెల 7వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. దర్శకుడు శాంతరూపన్ మాట్లాడుతూ…‘ఈ కథను అంగీకరించిన రష్మికకు థాంక్స్. ఈ సంస్థలో ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలు నిర్మితమయ్యాయో చూశాం. ఈ సినిమా కూడా వాటి తరహాలోనే కొత్తగా ఉంటుంది’ అన్నారు.
నాయిక రష్మిక మందన్న మాట్లాడుతూ…‘దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది. నటుడు దేవ్ మోహన్ మాట్లాడుతూ…‘తెలుగులో నా మొదటి సినిమా ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతున్నది. ఇంతలోనే మరో మంచి ప్రాజెక్ట్ దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కే.ఎం. భాస్కరన్, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

