Thamma Movie | బాలీవుడ్లో హారర్-కామెడీ స్త్రీ యూనివర్స్ నుంచి మరో బ్లాక్‌బస్టర్ సిద్ధమవుతోంది. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘థామా’. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా నుంచి ‘పాయిజన్ బేబీ’ (Poison Baby) అంటూ సాగే స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా, మలైకా అరోరా తమ డ్యాన్స్‌తో అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్-కామెడీ, మడాక్ యూనివర్స్‌లోని ఐదో చిత్రం (‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’, ‘స్త్రీ 2’ తర్వాత థామా).