ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక భామ తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అంతే కాదు వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి. దీంతో అమ్మడి క్రేజ్ భారీగా పెరిగింది.
రష్మిక క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ ఫుడ్ సంస్థ మెక్డొనాల్డ్స్ సరికొత్త ప్రణాళికను రచించింది. నవంబర్ 19 నుంచి మెక్డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ట్రీట్ ను ఆమె అభిమానుల కోసం అందించబోతోంది. మెక్డొనాల్డ్స్ ఇండియా (సౌత్ అండ్ వెస్ట్) తన అభిమానులను ఆనందపరిచేందుకు నటి రష్మిక మందన్నతో కలిసి ‘ది రష్మిక మీల్’ అనే ప్రత్యేక మీల్ కేటగిరీని రూపొందించింది.
ది రష్మిక మీల్ భోజనంలో రష్మికకు ఇష్టమైన మెక్ స్పైసి, ఫ్రైడ్ చికెన్, మెక్ స్పైసి చికెన్ బర్గర్, పెరి పెరి ఫ్రైస్, నింబూ ఫిజ్, మెక్ ఫ్లర్ర్రి ఉన్నాయి. ఇప్పుడు రష్మిక అభిమానులు కూడా ఆమెకు ఇష్టమైన ‘ది రష్మిక మీల్’ను తినవచ్చు. ఈ ప్రత్యేకమైన అసోసియేషన్ గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ “మెక్డొనాల్డ్స్ నా కంఫర్ట్ ఫుడ్. మెక్స్పైసీ చికెన్ బర్గర్లో పెరి పెరి ఫ్రైస్ని ఉంచడం నాకు ఇష్టం. జీవితంలోని పెద్ద, చిన్న సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకోవడానికి మెక్ఫ్లరీ మరొక మార్గం. నా మెక్డొనాల్డ్స్ ఫేవరెట్లను అందరితో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.