Rashmika | పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న అందాల నటి రష్మిక మందన్న. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే కెరీర్లో అగ్రస్థాయికి చేరుకున్నా, దాని వెనక తన వ్యక్తిగత జీవితంలోచేసిన త్యాగాలు, ఎడబాటు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది రష్మిక . ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “నేను దాదాపు ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్లలేకపోయాను. నా చెల్లి ఇప్పుడు 13 ఏళ్లు. ఆమెతో గడిపే అమూల్యమైన క్షణాలను కోల్పోతున్నానని ఎప్పుడూ బాధగా అనిపిస్తుంది. నాకు ఆమెకి 16 ఏళ్ల తేడా. అయినా, మా మధ్య అనుబంధం చాలా బలంగా ఉంది. ఒక్కోసారి శని, ఆదివారాలు ఇంట్లో ఉండాలనిపిస్తుంది… సెలవు దొరక్క ఏడుపొస్తుంది.”
కేవలం కుటుంబం మాత్రమే కాదు, స్నేహితుల నుండి కూడా దూరం అయ్యాను. ఒకప్పుడు చిన్న చిన్న ట్రిప్స్‌కు, పార్టీకి నన్ను పిలిచే స్నేహితులు ఇప్పుడు కాల్ చేయడం మానేశారు. ఎందుకంటే, ఆవిడ బిజీగా ఉంటుంది అనే భావన వాళ్లలో నెలకొందని నేను ఫీలవుతున్నాను. నిజానికి వాళ్లతో పాటు గడిపే క్షణాలు జీవితానికి చాలా అవసరం. కానీ ఈ బిజీ షెడ్యూల్ కారణంగా వాళ్లను మిస్ అవుతున్నాను. తన తల్లి చెప్పిన మాటలని కూడా రష్మిక గుర్తు చేసుకుంది. మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది . జీవితంలో రెండు దారులు ఉంటాయి. ఒకటి కెరీర్, మరొకటి వ్యక్తిగత జీవితం. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ నేనైతే రెండు వైపులా సమంగా వెళ్తానని నమ్మే మనస్తత్వం ఉన్న వ్యక్తిని. కానీ నిజంగా ఇది ఎంత కష్టం అనేది ఇప్పుడు అనుభవిస్తున్నాను అని రష్మిక పేర్కొంది.
ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘తామా’, తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘మైసా’ చిత్రాలు చేస్తుంది. అయితే రష్మిక కామెంట్స్‌పై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. స్టార్స్ కూడా మనలానే మానవులే… వాళ్లకూ కుటుంబాలుంటాయి, బాధలుంటాయి” అంటూ పలువురు ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు.