Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంతర్జాతీయ వేదికలపై మరోసారి భారత గౌరవాన్ని చాటారు. జపాన్‌లో జరిగే ప్రతిష్టాత్మక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్‌లో వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా ఎంపిక కావడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే 2024లో ఈ అవార్డుల వేదికపై మెరిసిన రష్మిక… ఇప్పుడు మళ్లీ అదే వేదికపై కనిపించబోతున్నారు. దీంతో ఈ అవార్డ్స్‌లో రెండుసార్లు ప్రెజెంటర్‌గా వ్యవహరించిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా ఆమె చరిత్ర సృష్టించారు.
ఈసారి క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ మే 23న టోక్యోలో అంగరంగ వైభవంగా జరగనుంది. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో ప్రతిభ కనబరిచిన కళాకారులను సత్కరించే ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ వేడుకలో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో కలిసి రష్మిక విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఆమె పాల్గొనడం వల్ల భారతీయ ప్రేక్షకుల్లో కూడా ఈ ఈవెంట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. పుష్ప సినిమాలో ‘శ్రీవల్లి’ పాత్ర ద్వారా రష్మిక మందన్నకు జపాన్‌లో విశేషమైన క్రేజ్ వచ్చింది. అక్కడి ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రస్తుతం రష్మిక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘మైసా’, ‘రణబాలి’ వంటి భారీ అంచనాలున్న చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆమె కెరీర్ మరో లెవెల్‌కు వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రష్మిక మందన్న అంతర్జాతీయ వేదికలపై వరుస అవకాశాలు అందుకుంటూ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్నారు. భారతీయ నటీమణులకి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతున్నాయన్న దానికి ఆమె మరో ఉదాహరణగా నిలుస్తున్నారు.