Kohli – Rohit | జంటగా నాలుగొందలు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ, రోహిత్..!
Kohli - Rohit : అంతర్జాతీయ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు చరిత్ర సృష్టించారు.
Kohli – Rohit : అంతర్జాతీయ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు చరిత్ర సృష్టించారు. వచ్చే వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రో-కో జంటగా నాలుగొందల మ్యాచ్ ఆడేశారు. ప్రస్తుతానికి 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న వీరు లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డేలో ఆడడం ద్వారా ఈ ఫీట్ సాధించారు. తద్వారా.. ఈ మైలురాయిని అధిగమించిన మొట్టమొదటి భారత జోడీగా కోహ్లీ, రోహిత్ రికార్డు నెలకొల్పారు.
భారత పురుషుల క్రికెట్‌కు విశేష సేవలందిస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కెరీర్ చరమాంకంలో మరో ఘనత సాధించారు. క్రీజునంటుకొని ఎన్నో మ్యాచులు గెలిపించిన వీరిద్దరు జంటగా నాలుగొందల మ్యాచ్ ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో మరే భారత ఆటగాళ్లకు సాధ్యమవ్వని రికార్డును సొంతం చేసుకుందీ ద్వయం. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోకో.. లార్డ్స్ వన్డేలో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
Another massive feat for an 𝗶𝗰𝗼𝗻𝗶𝗰 𝗱𝘂𝗼 🫡#TeamIndia greats Rohit Sharma and Virat Kohli become the first Indian pair to play 4️⃣0️⃣0️⃣ international matches together 🤝
Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#ENGvIND | @ImRo45 | @imVkohli pic.twitter.com/5k39JCxb4S
— BCCI (@BCCI) July 19, 2026
ఇప్పటివరకూ అంతర్జాతీయంగా 562 మ్యాచులు ఆడిన విరాట్ 28,285 రన్స్ కొట్టాడు. 85 శతకాలు బాదిన రన్ మెషీన్.. అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 254 నాటౌట్. రోహిత్ విషయానికొస్తే.. వన్డేలు, టీ20లు, టెస్టులు కలిపి 514 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో 50 శతకాలు, 112 హాఫ్ సెంచరీలతో.. 20, 289 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 264.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

