intruder cut women’s hair | అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి.. మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడు
intruder cut women's hair | ఒక ఆగంతకుడు అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడుతున్నాడు. నిద్రిస్తున్న మహిళల జుట్టు కత్తిరిస్తున్నాడు. వరుసగా రెండు సంఘటనలు జరుగడంతో ఆ గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు
పాట్నా: ఒక ఆగంతకుడు అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడుతున్నాడు. నిద్రిస్తున్న మహిళల జుట్టు కత్తిరిస్తున్నాడు. వరుసగా రెండు సంఘటనలు జరుగడంతో ఆ గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు. (intruder cut women’s hair) బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 16న దర్హార్ గ్రామంలో రాత్రివేళ నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న ఒక మహిళ జుట్టు కత్తిరించాడు. అలికిడికి ఆమె మేల్కోగా ఆ వ్యక్తి చీకటిలో మాయమయ్యాడు.
కాగా, నేలపై కత్తిరించిన జుట్టు, కత్తెర ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి ఆ మహిళ షాక్ అయ్యింది. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. నల్లదుస్తులు ధరించిన ఆ వ్యక్తి చేతిలో ఒక సంచి ఉన్నట్లు ఆ మహిళ తెలిపింది. తనకు మగతగా అనిపించిందని, అపస్మారక స్థితిలోకి నెట్టడానికి ఏదో పదార్థాన్ని అతడు ఉపయోగించినట్లు ఆమె ఆరోపించింది.

Woman Hair Cut
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. రాత్రివేళ ఇళ్లల్లో నిద్రిస్తున్న మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడ్ని పట్టుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
అయితే వారం కిందట కూడా గురువారం రోజునే మరో ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగింది. వారం రోజుల్లో రెండుసార్లు ఆ వ్యక్తి ఇళ్లల్లోకి చొరబడి మహిళల జుట్టు కత్తిరించడంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇది తెలుసుకున్న స్థానిక మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

