Rashmi Gautam | ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులకి వినోదం పంచే యాంకర్ రష్మీ గౌతమ్. వచ్చి రానీ తెలుగులో ఆమె వేసే పంచ్‌లు, గ్లామర్ షోతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎక్కువగా ఈటీవీలోనే షోస్ చేస్తూ అడపాదడపా సినిమాలలో మెరుస్తుంది. పర్యావరణ ప్రేమికురాలైన రష్మి గౌతమ్.. మూగజీవాల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. వీధుల వెంట ఉండే కుక్కలు, ఇతర జంతువులకు ఎవరైన హాని కలిగిస్తే ఏ మాత్రం ఊరుకోదు. గట్టిగా తన వాయిస్ వినిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్.. ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స అయ్యిందని పేర్కొన్నారు. విపరీతమైన బ్లీడింగ్, భుజం నొప్పితో ఇబ్బంది పడ్డానని.. గర్భాశయంలోని గడ్డలను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగించినట్టు కూడా రష్మీ పేర్కొంది.
వైద్యుల సూచన మేరకు రష్మీ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకొని ఇప్పుడు వెకేషన్‌కి వెళ్లింది. మండుటెండల్లో సేద తీరేందుకు ఇండోనేషియాలోని బాలీకి స్నేహితులతో కలిసి వెళ్లారు. పలు ప్రాంతాలలో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అయితే వెకేషన్లో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్స్ ఇచ్చిన మందులని వేసుకుంటున్నట్టు పేర్కొంది. అయితే రష్మీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండగా, వాటిపై ఒక్కొక్కరు ఒక్కో మాదిరిగా కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే రష్మీపై ఫుల్ సీరియస్ అయ్యారు.
పహల్గామ్ దాడి ఘటనతో దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్ కు వెళతావా? అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. దానికి రష్మీ గౌతమ్ అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం నేను బాలిలో ఉన్నా. నా సంస్కృతి, సంప్రదాయాలకు ఈ దేశం ఎంతో దగ్గరగా ఉంటుంది కాబట్టే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది రెండు నెలల క్రితమే ప్లాన్ చేసిన వెకేషన్. పుట్టినరోజుకు ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాంతానికి టూర్‌కు వెళ్లడం నాకు ఇష్టం. అందుకే ఇక్కడకు వచ్చాను. శస్త్రచికిత్స నుంచి నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అంటూ రష్మీ తనదైన శైలిలో బదులు ఇచ్చింది.