Dunki | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా డంకీ (Dunki). రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. సలార్ విడుదలకు ముందు రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.470 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసింది.
చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది డంకీ. Shanghai International Film Festivalలో డంకీ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఎంపికైంది . డంకీ స్క్రీనింగ్‌కు హాజరు కావాలని డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఆహ్వానం అందుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది షారుఖ్ ఖాన్ అండ్ హిరానీ టీం. డంకీ త్వరలోనే చైనాలో విడుదల కానుంది. మరి హిరానీతోపాటు షారుఖ్ ఖాన్ టీం కూడా ఫిలిం ఫెస్టివల్‌కు హాజరవుతుందా అనేది చూడాలి.
రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.