ప్రతి నాయకుడిగా అందరకి సుపరిచితుడైన విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారిగా కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సంస్థ నిర్మించబోతుంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం. పూర్తి వినోదాత్మకంగా కొనసాగే కుటుంబ కథా చిత్రమిది. ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో జరిగే పరిణామాలను ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ వేలో చూపించబోతున్నాం. మార్చి నుండి చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు.