Prashanth Varma – Ranveer Singh | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) – బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రద్దు అయినట్లు ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్‌వర్మ – రణవీర్ సింగ్ కాంబోలో ఒక మూవీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ‘రాక్షస్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రానుండగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే హీరో దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రయూనిట్ స్పందిస్తూ.. ఈ వార్తలు ఫేక్ అని ఖండించింది. అయితే కారణం ఏంటో తెలిదు కానీ.. ఈ సినిమా మళ్లీ రద్దు అయినట్లు ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్‌పై రణవీర్ మాట్లాడుతూ.. ప్రశాంత్ చాలా ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. మేమిద్దరం కలిసి ఒక సినిమా గురించి అనుకున్నాం కానీ అది అవ్వలేదు. భవిష్యత్తులో ఒక మంచి ప్రాజెక్ట్‌తో మళ్లీ కలుస్తాము అని ఆశిస్తున్నా అంటూ రణవీర్ రాసుకోచ్చాడు.
ఈ ప్రాజెక్ట్‌పై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రణ్వీర్లోని ఎనర్జీ మరియు టాలెంట్ దొరకడం చాలా అరుదు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ కలిసి సినిమా చేస్తాం అంటూ తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇది సరైన సమయం కాదు.. ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్‌తో మీ ముందుకు వస్తాం అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
మరోవైపు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం.. ‘జై హనుమాన్’ (Jai Hanuman) షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
And now it’s official 🙂 #RanveerSingh and #PrasanthVarma part ways on #Rakshas. pic.twitter.com/gRn7hqOtZe
— Himesh (@HimeshMankad) May 30, 2024