Telangan Folk Song | ఈ మధ్య తెలంగాణ జానపద గీతాలు యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన అనంతరం జానపద పాటలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ విషయాన్ని క్యాచ్ చేసుకున్న పలువురు కళకారులు సొంతంగా ఆల్బమ్స్ చేస్తూ యూట్యూబ్‌లో వదిలి రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే తాజాగా ఇదే కోవలో వచ్చి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది రాను బొంబాయికి రాను (Ranu Bombay ki Ranu) అనే పాట.
జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఆల్బమ్ ఇప్పటివరకు 400 మిలియన్స్ వ్యూస్ అందుకుంది. అంతేగాకుండా.. కేవలం రూ. 3 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాట యూట్యూబ్ ద్వారా దాదాపు రూ.1 కోటి రూపాయల ఆదాయం పొందినట్లు తెలుస్తుంది. రాబోయో రోజుల్లో కూడా ఈ పాట వ్యూస్‌ని బట్టి యూట్యూబ్ ద్వారా మరింత ఆదాయం రాబోతున్నట్లు సమాచారం.
ఈ పాటను రాము రాథోడ్ రాయగా.. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు, ప్రభ మరియు రాము కలిసి పాడారు. మొదట ఈ పాటను వేములవాడలో చిత్రీకరించారు. ఆ తర్వాత, క్లైమాక్స్‌ను మరింత మంచిగా చూపించడానికి జగిత్యాలలో తిరిగి షూట్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది. నృత్య దర్శకుడు శేఖర్ వైరస్ మాస్టర్ సరదాగా, ఉత్సాహంగా ఉండే డ్యాన్స్ స్టెప్పులతో ఈ పాట విజయంలో కీలక పాత్ర పోషించారు.