Rani Mukerji reunites with Shah Rukh Khan on King | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అందాల నటి రాణీ ముఖర్జీ మరోసారి వెండితెరపై కలిసి సందడి చేయనున్నారు. పఠాన్ సినిమాతో షారఖ్కి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మరోసారి షారుఖ్‌తో కలిసి ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కింగ్ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం మే 20 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌లో షారుఖ్‌కి జోడిగా రాణీ ముఖర్జీ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘కభీ అల్వీదా నా కెహనా ‘ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సినిమాలో రాణీ ముఖర్జీ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తల్లి పాత్రను పోషించనున్నారు. ఈ పాత్ర సినిమా కథలో ఒక కీలకమైన మలుపు తిప్పుతుందని తెలుస్తోంది.
‘కింగ్’ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక కిల్లర్ పాత్రలో కనిపించనుండగా, ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వీరితో పాటు దీపికా పదుకొనే, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, సుహానా ఖాన్, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ వంటి భారీ తారాగణం కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు. ముంబైలో మే 20 నుంచి ప్రారంభమయ్యే మొదటి షెడ్యూల్ అనంతరం, యూరప్‌లో ఒక భారీ అంతర్జాతీయ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ‘కింగ్’ చిత్రం 2026 అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను మళ్లీ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.