ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్ (Anger Tales). బిందుమాధవి (Bindu Madhavi), వెంకటేశ్ మహా, మడోన్నా సెబాస్టియన్, ఫని ఆచార్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నుంచి రంగ లిరికల్ వీడియో సాంగ్ (Ranga Lyrical Song)ను మేకర్స్ విడుదల చేశారు. యాంగర్ టేల్స్ లో తరుణ్ భాస్కర్, సుహాస్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఏ డప్పు కొట్టి చిందులేసి.. పూలు కట్టి దండలేసి.. గుండె నిండ నిండిఉన్న హీరోనే ఫుల్లుగా.. మోసేత్తారుగా అంటూ సాగుతున్న పాట మాస్ బీట్తో సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ పాటను హర్ష జొన్నలగడ్డ, కార్తికేయ, ప్రభల తిలక్ రాయగా. స్మరన్ సాయి సంగీత సారథ్యంలో పార్థసారథితో కలిసి పాడాడు. ఇప్పటికే వచ్చిన అప్డేట్ ప్రకారం యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ రంగా, పూజ, రాధ, గిరి అనే నలుగురు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతుంది.
యాంగర్ టేల్స్ వెబ్ ప్రాజెక్ట్‌కు కళాకారుడు ఫేం ప్రభల తిలక్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. యాంగర్ టేల్స్ ను నటుడు సుహాస్, నిర్మాత శ్రీధర్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నాడు. ఆవకాయ్ బిర్యానీ ఫేం బిందు మాధవి మళ్లీ 12 ఏండ్ల గ్యాప్ తర్వాత ఈ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతుంది.
రంగ లిరికల్ వీడియో సాంగ్..
యాంగర్ టేల్స్ టీజర్..
యాంగర్ టేల్స్ ట్రైలర్..
Vennela Kishore | ఇండియన్ 2లో వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Samuthirakani | యాక్షన్ మూడ్‌లో సముద్రఖని.. PKSDT షూటింగ్ అప్డేట్
Bichagadu 2 | శాకుంతలం వర్సెస్ బిచ్చగాడు 2.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఫైట్