రణ్‌బీర్‌కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. రష్మిక మందన్న కథానాయిక. నిర్మాణ నుంచే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడ్డట్లు తెలిసింది.
త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారని, డిసెంబర్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. టీ సిరీస్ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే రిలీజ్‌ను వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుందని తెలుస్తున్నది.