Animal Movie Post Poned | కబీర్ సింగ్ రిలీజయ్యాక సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వూలో అందరూ కబీర్ సింగ్ ను వైలెంట్ ఫిలిం అంటున్నారు. అసలైన వైలెంట్ సినిమా అంటే ఏంటో నా తర్వాతి సినిమాలో చూపిస్తా అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే అసలైన వైలెంట్ సినిమా చూపించబోతున్నట్లు ఇటీవల రిలీజైన ప్రీ-టీజర్‌తో స్పష్టం చేశాడు. మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక గ్రూప్‌ను గొడ్డలి పట్టుకుని నరకుతూ భీభత్సం సృష్టించాడు. ప్రీ టీజర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాడు. ఇండియాలోనే ది మోస్ట్ వైలెంట్ సినిమాగా సందీప్ యానిమాల్ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ సినిమా గురించి యావత్ ఇండియాలోని సినీ లవర్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలానే ఉండటంతో యానిమల్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పైగా అదే రోజున చిరు భోళా శంకర్, రజనీ జైలర్ సినిమాలు విడుదవుతున్నాయి. యానిమల్ ఎంత స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్నా.. ఈ సీనియర్ హీరోల సినిమాలకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా.. పోటీగా ఎలాంటి సినిమా ఉన్నా సైడ్ ఇవ్వాల్సిందే. వీళ్లను అస్సలు తక్కువంచనా వేయడానికి లేదు. మాస్ మార్కెట్లను ప్రభావితం చేస్తారు. పైగా అటు హిందీలోనూ గదర్-2 రూపంలో పెద్ద కాంపిటీషన్ ఉంది.
వీటిన్నిటి దృష్టిలో పెట్టుకుని మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. మరో వారంలోపు దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది. ఇటీవలే తన షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఈ బ్యూటీ సెట్స్‌లో దిగిన ఫోటోను అభిమానులుతో పంచుకుంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడీయోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.